1బి వీసాపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు... మనవి మనకే...
posted on May 20, 2017 5:34PM
.jpg)
అమెరికా హెచ్ 1బి వీసాలపై నిబంధనలు కఠినతరం చేసి భారతీయులకు పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికా కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్. మూడు సంవత్సరాల కాలంలో మంత్రిత్వశాఖ సాధించిన విజయాలపై పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెచ్ 1బి వీసాల అమెరికా కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది తప్ప, భారతీయులకు జారీ చేసే వీసాల సంఖ‍్య తగ్గదని తెలిపారు. ఇప్పటివరకు మనకు లభిస్తున్న హెచ్ 1 బీ వీసాలు మనకు దక్కుతాయని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. హెచ్ 1 బీ వీసాల జారీకి లాటరీ ప్రక్రియలో మార్పులు తేవాలని అమెరికా ప్రయత్నిస్తోందని తాను భావిస్తున్నానన్నారు. అంతే తప్పఇండియన్ టెకీలకు జారీ చేసి వీసాల సంఖ‍్య తగ్గదన్నారు.