SP నాయక్ కి డాక్టరేట్.. తెలుగువన్ యాంకర్ కి గౌరవం
posted on Oct 29, 2021 12:21PM
బంజారా మాట పాటకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగువన్ టోరిబంజారా యాంకర్ SP నాయక్ అలియాస్ సోమ్లా దాదా శీనుకు బెంగుళూర్ లోని ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. బంజారా పాటల మాంత్రికుడిగా పేరున్న ఎస్పీ నాయక్.. బంజారా నటుడిగా కూడా గుర్తింపు పొందారు. బంజారా మొటివేషన్ స్పీకర్ గా, వక్తగా కూడా ఆయనకు మంచి పేరుంది.
బంజారా జాతికోసం ఎన్నో పాటలు పాడారు ఎస్పీ నాయక్. వాళ్లకు అర్ధమయ్యేలా ఎన్నో పాటలు రాశారు. బంజారా జనాల విధివిధానాలపై చిన్న చిన్న సినిమాలు తీశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జనాలకు అర్ధమయ్యే రీతిలో వీడియోలు తీశారు. స్వచ్చంద కార్యక్రమలు చేస్తూ పేదలకు తనకు తోచిన సహాయం అందించారు ఎస్పీ నాయక్. బంజారా జాతికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి గౌరవ డౌక్టరేట్ ప్రకటించింది బెంగళూరు యూనివర్శిటీ.
ఎస్పీ నాయక్ బంజారా Tv ఛానల్లో యాంకర్ గా చేసారు. ఇప్పటికే అదే చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగువన్ టోరిబంజారా యూట్యూబ్ ఛానల్లో యాంకర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు తెలుగువన్ CMD కంఠంనేని రవి శంకర్ గారు, ఇంచార్జి సుబ్బు ప్రోత్సాహం వల్ల చాలా కార్యక్రమలు చేస్తున్నారు. టోరిబంజారా ఛానలో తాను డైరెక్టర్ గా వ్యవరిస్తూ అశోక్ రాథోడ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేసున్నారు ఇప్పుడు బంజారా జాతీ ఖ్యాతి ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి తమవంతు పనిచేస్తు ముందుకు పోతున్నారు.
ఇప్పటి వరకు Sp నాయక్ మూడు వేల పాటలు రాసి పాడారు ఇంకా చాలా బంజారా సినిమాల్లో నటించారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు. అనేక వేదికలపై కాలికి గజ్జెకట్టి ఆడారు పాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది కి సాంస్కృతిక పరిధిలో ఉద్యోగం కూడా ఇచ్చారు. కానీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఎస్పీ నాయక్ కు మాత్రం రాలేదు. అయినా నిరాశపడకుండా తమ ప్రతిభతో ముందుకు సాగారు. తనకు పాటలు పడడం అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని చెప్పారు ఎస్పీ నాయక్.