రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

 

వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా  రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.  

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

దీంతో, పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీచేశారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu