జగన్‌పై పరువునష్టం దావా వేస్తా:సీఎం రమేశ్
posted on Apr 13, 2016 6:49PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నారు టీడీపీ ఎంపీ రమేశ్. కొద్ది రోజుల క్రితం రమేశ్‌కు చెందిన కంపెనీపై జగన్‌కు చెందిన సాక్షి పత్రిక కథనాలు ప్రచురించింది. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రమేశ్. నిరాధారమైన వార్తలు రాస్తున్న సాక్షిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానన్నారు. యూపీలో ఉన్న తన కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని..అలా పెట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని..ఒకవేళ నిరూపించలేకపోతే సాక్షిని మూసివేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి డబ్బుతో పత్రిక పెట్టిన జగన్‌కు, అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు.