నన్నపనేనికి వడదెబ్బ..!
posted on Apr 13, 2016 6:32PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఎండవేడిమికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆస్పత్రిపాలవుతున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి వడదెబ్బకి గురయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేరారు. వడదెబ్బకు గురికావడంతో ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ నన్నపనేని రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ నుంచి కోలుకోవడానికి అవసరమైన వైద్యసేవలను నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు.