టీఆర్‌ఎస్ ఎల్పీలో వైఎస్సార్సీ ఎల్పీ విలీనం చేసిన స్పీకర్..

 

ఒకవైపు ఏపీలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వలసలు పోతూ జగన్ షాకిస్తుంటే ఇప్పుడు తెలంగాణ వైసీపీ నుండి పెద్ద దెబ్బే తగిలింది. ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్ తమను టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయగా దానిని పరిశీలించిన స్పీకర్... వారిని టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. శాసనసభలో వారికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిపి సీట్లు కేటాయించాలని కూడా నిర్ణయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu