హిమాచల్‌లో లోయలో పడ్డ బస్సు..12 మంది దుర్మరణం
posted on May 8, 2016 11:12AM

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులోయలో పడిన దుర్ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. అర్థరాత్రి ధర్మశాల నుంచి రెకాంగ్‌కు వెళుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మండి జిల్లాలో రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించగా..36 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను కాంగ్రా జిల్లా టండాలోని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చీకటి, అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.