అగస్టా స్కాం.. సోనియా, మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్..!


ఇప్పటికే అగస్టాం స్కాం ప్రకంపనాలతో దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుండి రోజుకో ఆసక్తికర  విషయం బయటపడటం చూస్తూనే ఉన్నాం. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈకేసుకు సంబంధించి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ఈడీ విచారణ జరుపుతోంది.

 

మరోవైపు ఈ కేసులో భాగంగా సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆందోళనలు తలెత్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. విచారణ జరిపిన కోర్టు ఈ పిల్ పై కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ స్కాంపై దర్యాప్తును.. సీబీఐ నుండి కోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక బృందానికి ఇవ్వడంపై స్పందన ఎంటో కూడా తెలియజేయాలని కోరింది. ఇటలీ కోర్టు తన తీర్పులో ప్రముఖులైన రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించినప్పటికీ, వారికి విరుద్ధంగా సీబీఐ చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిల్ దాఖలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu