తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల విజయం

 

తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 75 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో పరిధిలోని మద్దూరు మండలం బూనీడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి 692 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మోగించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu