నేను మాత్రం సోనియాగాంధీ పటాన్ని తీసేయను.. డిఎస్
posted on Jul 4, 2015 6:58PM

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే ఆపార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరుతున్నట్టు తెలియజేశారు కానీ ఎప్పుడు చేరతారో అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆయన ఈనెల 8 వ తేదీన తెరాసలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు ఆశించి తెరాసలో చేరలేదని తెలంగాణ అభివృద్ధికి పాటుపడదామని చేరానని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు. అయితే గాంధీభవన్ లో ఫొటోలు తీసేసిన విషయంపై స్పందిస్తూ ఫొటోలు తీసేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. తను మాత్రం తన ఇంట్లో ఉన్న సోనియాగాంధీ పటాన్ని తీసేయనని స్పష్టం చేశారు.