20 రోజుల్లో తెలంగాణపై నోట్
posted on Sep 2, 2013 8:36PM

విభజనపై సీమాంద్ర భగ్గుమంటున్నా కేంద్ర మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సిడబ్ల్యూసి తీర్మానాన్ని కేంద్ర మంత్రి వర్గం ముందుకు ఉంచనుంది. ఈ నేపధ్యంలో 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర కేబినేట్ ముందకు తీసుకువస్తామన్నారు కేంద్ర హొంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర హొం శాఖ ఇప్పటికే నోట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించిందని, అయితే ఈ నోట్ తయారు చేయటానికి ఎలాంటి తుది గడువు లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో 20 రోజుల్లోనే ఈ నోట్‌ను సిద్దం చేసి కేబినెట్ ముందుంచుతాం అన్నారు షిండే.
ఈ నోట్‌లో విభజన తరువాత తలెత్తబోయే అన్ని అంశాలను చర్చించనున్నామన్న ఆయన నోట్‌లో చర్చించే విషయాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు.