హైకోర్టు గడపదొక్కిన తెలంగాణ తల్లి విగ్రహ వివాదం
posted on Dec 7, 2024 1:27PM
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది. ఆ పార్టీ నాయకుడు, జర్నలిస్ట్ జూలూరి గౌరిశంకర్ విగ్రహావిష్కరణ ఆపాలని హైకోర్టులో పిల్ వేశారు. ఈ నెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రేవంత్ సర్కార్ చెప్పింది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసి రేవంత్ సర్కార్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసి ప్రజల మనో భావాలను కించపరిచినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు,మేధావులు,రచయితలు,కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెసీఆర్ మీద కక్ష్యతో విగ్రహాన్ని మార్పులు చేసినట్టు జూలూరి వివరించారు. ఇటీవల ఎపిలో కూడా వైకాపా సోషల్ మీడియా వింగ్ కూటమి నేతలను టార్గెట్ చేసి విష ప్రచారం చేసింది. కూటమి అధికారంలో రాగానే వారిపై కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణ మురళి, ఆర్జీవీ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వీరిపై కేసులు నమోదు కావడాన్నినిరసిస్తూ జర్నలిస్ట్, వైకాపా నేత విజయబాబు హైకోర్టులో పిల్ వేసి అభాసుపాలయ్యారు. విజయబాబుపై 50 వేల జరిమానా విధించడమే గాక అక్షింతలు వేసింది.