తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (సెప్టెంబర్ 23) వెల్లడించింది.

అంతే కాకుండా ఎలక్షన్ ప్రణాళిక అందజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ సీఎస్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ కూడా రాసింది.  ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈ నెల 2న, మండల, జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన ఓటర్ల జబితాను ఈనెల 10న ప్రచురించినట్లు పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లపై సమాచారం కోరింది.  

 ఈ నేపథ్యంలో అందరి దృష్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ పైనే ఉంది. ఈ పిటిషన్ బుధవారం (సెప్టెంబర్ 24)న విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపుఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్​పిటిషన్​దాఖలైంది.  దీనిపై కోర్టు ఏం నిర్ణయిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికల తొలి విడతకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu