రెగ్యులర్ ఇంక్రిమెంట్ కావాలి.. తెలంగాణ ఇంక్రిమెంట్ లాభం లేదు
posted on Sep 15, 2014 2:41PM
.jpg)
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంక్రిమెంట్ వల్ల తమకు ఎంతమాత్రం లాభం లేదని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లంచ్ అవర్ ర్యాలీ నిర్వహించారు. స్పెషల్ పేను అన్ని అలవెన్సులు వర్తించే రెగ్యులర్ ఇంక్రిమెంట్‌గా మార్చాలని తెలంగాణ ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణ ప్రభుత్వానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో సచివాలయం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.