రేవంత్ చెప్పిన తెలంగాణ ట్రంప్ ఎవరంటే?

తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ ట్రంప్ గా అభివర్ణించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్ననిర్ణయాలు ఏ విధంగా అయితే అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయో.. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు తీరని నష్టాన్ని చేకూర్చాయన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన నేరుగా కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా గతంలో తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారని అంటూ.. ఆయన పాలన నచ్చకే తెలంగాణ జనం ఓడించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని పేర్కొన్నారు.

ఢిల్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 19) జరిగిన బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం సదస్సులో రేవంత్ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవలంబిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.  ట్రంప్ విధానాల కారణంగానే పలు సంస్థలు అమెరికాను కాదంటున్నాయన్నారు. అలా అమెరికా వద్దనుకుంటున్న సంస్థలు తెలంగాణకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో హార్వర్డ్, స్టాన్ ఫెర్డ్ సంస్థలతో తాను మాట్లాడతానని చెప్పారు.   తెలంగాణకు వచ్చే సంస్థలకు అవసరమైన అన్ని మౌలిక వసతులూ కల్పిస్తామన్న రేవంత్... తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇష్టారాజ్యంగా పాలన చేసే అవరైనా ట్రంపే అవుతారన్న రేవంత్ రెడ్డి.. అటువంటి వారి పాలన ఎక్కువ రోజులు నడవదన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu