ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు : సీఎం రేవంత్
posted on Sep 19, 2025 5:46PM
.webp)
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్, కేటీఆర్, హారీశ్‌రావులు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించేవారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించి చాలా రోజులైనా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. కేటీఆర్ ఏం చేప్తే కిషన్‌రెడ్డి అది చేస్తారు అని తెలిపారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని ముఖ్యమంత్రి తెలిపారు.
నేను కూడా ఈరోజు ప్రోగ్రాంలో ఎంతో మందికి కండువాలు కప్పాను ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నాం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
2014-19 బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు.లేరు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు.. అది ఊరికే పోదని అన్నారు.ఇక హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారు రేవంత్‌రెడ్డి తెలిపారు.