ఉద్దండరాయుని పాలెం చేరుకొన్న ప్రధాని, ప్రముఖులు

 

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికేరు. ఆయన హెలికాఫ్టర్లో వేదిక వద్దకు చేరుకొంటారు.

 

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, తెలుగు సినీ పరిశ్రమ నుంచి కృష్ణం రాజు, వెంకటేష్, సుమన్, అలీ, చలపతి, ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ తో సహా నందమూరి కుటుంబానికి చెందిన 50మంది సభ్యులు ఈ కార్యక్రమానికి తరలివచ్చేరు.

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఆయనతో బాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, నామా నాగేశ్వర రావు తదితరులు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చేరు.

 

కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి వేదిక వద్దకు చేరుకొన్నారు.ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు సతీ సమేతంగా వచ్చేరు. ముంబై కి చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేదిక వద్దకు తమకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో చేరుకొంటున్నారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన అతిధులను, లక్షలాది ప్రజలను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు శివమణి డ్రమ్ బీట్స్ తో మొదలయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu