తెలంగాణా బడ్జెట్ హైలైట్స్
posted on Nov 5, 2014 11:07AM
.jpg)
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. ఇంతవరకు ఆయన వెల్లడించిన బడ్జెట్ వివరాలు: తెలంగాణా రాష్ట్ర బడ్జెట్: రూ.1,00,637 కోట్లు; ప్రణాళికా వ్యయం: 48648; ప్రణాళికేతర వ్యయం: రూ.51,989 కోట్లు; బడ్జెట్ లోటు:రూ.17, 398 కోట్లు. రెవెన్యూ మిగులు అంచనా రూ.301 కోట్లు.
రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లకు రూ.400 కోట్లు; విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్లు; 6, 000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్ కోలో రూ.1000 కోట్ల పెట్టుబడి; 9, 000 చెరువుల అభివృద్ధికి రూ.2వేల కోట్ల కేటాయింపు. తెలంగాణలో దెబ్బతిన్న 45, 000 చెరువులను పునరుద్ధరణ; రైతులకు సోలార్ పంపు సెట్ల కోసం రూ.200 కోట్లు.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోటిన్నర, మొత్తం రూ.234 కోట్ల కేటాయింపు; గృహ నిర్మాణం రూ.1000 కోట్లు.
అమరవీరులకు పరిహారం కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు; 459మంది అమరవీరుల ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం.
బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు; ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు; మహిళా శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు, ఐసిడీఎస్ పథకానికి రూ.1103 కోట్లు; 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ లక్ష్యం; కళ్యాణ లక్ష్మీ (ఎస్సీ) పథకానికి రూ.150 కోట్లు, కళ్యాణ లక్ష్మీ (ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు కేటాయింపు.