లక్షా 637 కోట్లతో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. రూ. లక్షా 637 కోట్లతో ఈటెల తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... ఉద్యమ భవిష్యత్‌ను అందించేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించామని... వాటిని దృష్టిలో ఉంచుకుని స్వల్పకాల, దీర్ఘకాల కార్యక్రమాలను రూపొందించామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ను రూపొందించామని, ఇది కేవలం 10 నెలల బడ్జెట్ మాత్రమేనని వివరించారు. అమరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించాం. 459 మంది అమరవీరులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల పరిహారం అందించనున్నామని తెలిపారు.

48648 కోట్ల ప్రణాళిక వ్యయాన్ని, 51989 కోట్ల రూపాయల ప్రణాళికేతర వ్యయాన్ని, 301 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా, 17398 కోట్ల రూపాయల ఆర్దిక లోటును బడ్జెట్ లో పెట్టారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటిన్నర చొప్పున మొత్తం 234 కోట్లు కేటాయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu