డిఫెన్స్ లో టీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాల్లో ఫస్ట్ డేనే అధికారపార్టీ టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయింది. బడ్జెట్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. సర్కారు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు సమస్యలు, రైతులు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర సమాధానమే కరువైంది. ఓవైపు టీడీపీ నేతలు సర్కారు తీరును ఎండగడుతుంటే ఏం చేయాలో తెలియక కన్ ఫ్యూజన్ లో పడిపోయారు మంత్రులు. తమ వాగ్ధాటితోనైనా టీడీపీని నిలువరిద్దామంటూ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి లాంటి మాటకారుల ముందు వారి ఆటలు సాగలేదు. దీనికి తోడు బీజేపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో గళమెత్తారు. టీడీపీకి బీజేపీ తోడవ్వడంతో మొదటిరోజే అసెంబ్లీలో వాతావరణం వేడెక్కింది. ఫస్ట్ డే రోజునే అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కారు డిఫెన్స్ లో పడిపోయింది. మొదటిరోజే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన చెందుతున్నారని టాక్.