బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలని అర్థమా?
posted on Oct 21, 2014 4:01PM
.jpg)
బంగారు తెలంగాణ సాధించడం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కరెంటు కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ‘‘విద్యుత్ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’’ అన్నారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.