ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం..
posted on Mar 10, 2016 10:19AM
.jpg)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో తెలంగాణ ఏర్పడింది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది.. ప్రభుత్వ కార్యక్రమాలు జాతీయదృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామి అన్నారు.. ఇంకా పలు అంశాల గురించి గవర్నర్ ప్రస్తావించారు అవి..
* కాలేజీ విద్యార్ధులకు కూడా సన్న బియ్యం అమలు చేస్తాం
* వ్యవసాయం 0.8, పరిశ్రమలు 8.3
* డబుల్ బెడ్ రూం పథకానికి భారీ కేటాయింపులు చేశాం
* మిషన్ ఇంద్రధనస్సులో దేశంలో తెలంగాణ అగ్రస్థానం.. మిషన్ బగీరథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం
* స్వచ్చ భారత్ ను పెద్ద ఎత్తున చేపడతాం
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 11.7 శాతం అభివృద్ధి సాధిస్తాం
* ఈ ఏడాది నుండి బీసీలకు కల్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తాం
* సేవారంగం 14.9 వృద్ధి సాధిస్తాం
* ములుగులో ఉద్యానవన యూనివర్శిటీ నెలకొల్పుతాం
* గోదావరి జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాం..