రైతు పోరు బాట యాత్రలో చంద్రబాబు

ఆదిలాబాద్: తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రైతు పోరు బాట యాత్రను ప్రారంభించారు. అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం సాలెవాడ నుండి తన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టు పేరుతో గిరిజనులను అడవుల నుండి వేరు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి మనుషుల కంటే పులులే ఎక్కువయ్యాయన్నారు. మేం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉందని ధ్వజమెత్తారు. పేదరికం లేని సమాజమే తన ఆశయమని అన్నారు. సాలేవాడ కమ్యూనిటీ హాల్‌కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నుండి నిధులు ఇస్తామని బాబు చెప్పారు. కాగా అంతకుముందు జిల్లాకు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu