విద్యుత్ కోతపై హాట్ హాట్ చర్చ
posted on Dec 14, 2011 1:35PM
హైదరాబాద్:
రాష్ట్రంలో రైతులకు ఏడు గంటల పాటు విద్యుత్ అందించని వైనం ప్రభుత్వానికి ఇబ్బంది కలుగజేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కలెక్టర్ల సదస్సులో అన్నారు.సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో విద్యుత్ కోత విధించారు సరే మరి ఇప్పుడెందుకు కోత విధిస్తున్నారని అయన ప్రశ్నించారు. దీంతో సదస్సులో విద్యుత్ కోతపై హాట్ హాట్ చర్చ జరిగింది. అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవానికి పొంతన ఉండటం లేదన్నారు. వాస్తవాలు తెలియజేయాలన్నారు.
దానికి ట్రాన్స్‌కో ఉన్నతాధికారి స్పందిస్తూ కాకతీయ, ఎన్టీపిసిల్లో సాంకేతిక కారణలతో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి 18 నుండి పునరుద్దరణ అవుతుందని చెప్పారు. అప్పుడు పరిస్థితి మెరుగ పడుతుందని చెప్పారు. అయితే కరెంటు కోత ఉండకుండా అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేయాలని సిఎం అధికార్లకు సూచించారు. 750 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారి చెప్పారు.