ఆ తర్వాతే కొత్త రాష్ట్రాలు : హోం శాఖ

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో తెలంగాణతో పాటు అనేక కొత్త రాష్ట్రాల డిమాండ్లు పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే దీంతో దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనపై ముడిపడివున్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఏమాత్రం సంబంధం లేకుండా యూపీని నాలుగు ముక్కలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెల్సిందే.

దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ విభజన డిమాండ్లు వస్తున్న రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు, విస్తృత ప్రజాభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనికి సంబంధించి ఖచ్చితమైన కాలపరిమితిని చెప్పలేమని స్పష్టం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu