సోనియాఫై పిటిషన్ ,మరణ వాంగ్మూలాలు అడిగిన కోర్టు
posted on Dec 14, 2011 12:25PM
న్యూఢిల్లీ
: తెలంగాణలోని ఆత్మహత్యలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమంటూ దాఖలైన పిటిషన్‌పై పాటియాలా కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఆత్మహత్యలు చేసుకోవడానికి సోనియా కారణమని మీరు ఎలా చెప్పగలరని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. అందుకు పిటిషనర్ ఆత్మహత్యలు చేసుకున్న వారందరు కూడా తమ చావుకు సోనియా గాంధీయే కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.ఆధారాలు ఉంటే జనవరి 4వ తేదిలోగా ఆత్మహత్యలకు సంబంధించిన మరణ వాంగ్మూలాలను కోర్టుకు చూపాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
కాగా తెలంగాణలో జరిగిన పలు ఆత్మహత్యలకు సోనియా కారణమంటూ ఇటీవల ఓ న్యాయవాది పాటియాలా కోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు వేసిన విషయం తెలిసిందే. పాటియాలా కోర్టు ఆయన పిటిషన్ స్వీకరించి విచారణ జరుపుతోంది.