బెయిల్‌ కోసం గాలి,శ్రీనివాస్‌ల విశ్వ ప్రయత్నం

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు బెయిల్‌ కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గాలి జనార్థన్‌రెడ్డి నిన్న నాలుగో సారి బెయిల్‌ పిటీషన్‌ వేశారు. దీంతో ఓఎంసీ ఎండీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి కూడా నాల్గోసారి బెయిల్‌ కోసం సీబీఐ కోర్టులో పిటీషన్‌ వేశారు. గతంలో ఆయన మూడుసార్లు బెయిల్‌ కోసం పిటీషన్‌ పెట్టుకున్నారు. వాటిని సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసినప్పటికీ, వ్యూహాత్మకంగా ఆ పిటీషన్‌ను ఉపసంహరించుకుని తిరిగి సీబీఐ కోర్టునే ఆశ్రయించారు. వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu