పొన్నం ఆకట్టుకునే పనిలో కెసిఆర్
posted on Nov 11, 2011 1:42PM
హైదరా
బాద్:తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేదని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం,కాంగ్రెసు పార్టీల ప్రజాప్రతినిధులను ఆకర్షించే పనిలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ పడ్డారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేదని భావిస్తున్న ఆయన ఇతర పార్టీల శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను తన వైపు ఆకర్షించడం ద్వారా బలం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెసు కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ ను తన పార్టీలో చేర్చుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతిపక్షాల కన్నా ఎక్కువగా పొన్నం ప్రభాకర్ దాడి చేస్తున్నారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంత దూరమైన పోతామని ఆయన చెబుతున్నారు. తెరాస నాయకుల కన్నా కూడా తెలంగాణ విషయంలో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పొన్నం ప్రభాకర్ తమ పార్టీలోకి వస్తే అన్ని రకాలుగా బలం చేకూరుతుందని కెసిఆర్ భావిస్తున్నారట. అయితే, పొన్నం ప్రభాకర్ తెరాసలో చేరడానికి అంత సుముఖంగా లేరని చెబుతున్నారు.