విభజన చేస్తే దేశం ముక్కలు అవుతుంది : జోగి

హైదరాబాద్ : రాష్ట్రాల విభజనకు తెర తీస్తే దేశం ముక్కలు అవుతుందని  పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.రెండో ఎస్సార్సీకి సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకమని అయన  అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రాలను విభజించేందుకే ఎస్సార్సీని వేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్యే కాదని ఉత్తరప్రదేశ్ను కూడా విభజించటం తగదని జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల విభజనకు తెర తీస్తే దేశం ముక్కలు అవుతుందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu