మరో రూపంలో నిరసన తెలియజేస్తా: జానా

హైదరాబాద్:తెలంగాణ కోసం అవసరమైతే తాను మరో రూపంలో నిరసన తెలియజేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి గురువారం అన్నారు. తెలంగాణ ప్రజల ఒత్తిడి మేరకే తాను నాలుగు నెలల పాటు సచివాలయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణపై తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు.తెలంగాణ ఉద్యమం ఇప్పటికీ సద్దుమణగలేదని   చెప్పారు. తన నిరసనకు ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తాను ఫైళ్లు క్లియర్ చేస్తున్నట్లు చేస్తున్నానన్నారు. తాను రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం సంప్రదింపుల ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu