‘రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు సరికాదు’

హైదరాబాద్: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. పేద విద్యార్థులు పేదలుగానే ఉండాలా? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలచుకుని రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu