రెచ్చగొడితే బలయ్యేది నేతలే టిజి

హైదరాబాద్:  తెలంగాణ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని సీమాంధ్రకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రెచ్చగొడితే నేతలు బలయ్యే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల వారు బలయ్యారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై కమిషన్ వేయాలనేదే కేంద్ర ప్రభుత్వ భావన అని  కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, కాంగ్రెసు అధికార ప్రతినిధి రషీద్ అల్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటనలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు తన గోతిని తానే తవ్వుకుంటోందని, అందుకే రెండో ఎస్సార్సీ అంటోందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణలో కాంగ్రెసు సమాధి కావడం ఖాయమని ఆయన అన్నారు.  తెలంగాణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రకటన చేస్తేనే తాము స్పందిస్తామని, అల్వీ, దిగ్విజయ్ ప్రకటనలకు స్పందించాల్సిన అవసరం లేదని తెరాస నాయకుడు వినోద్ అన్నారు. వారు ఉత్తరప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu