ప్రణబ్ తో మరోసారి భేటీ కానున్న బొత్స
posted on Nov 10, 2011 8:14AM
న్
యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అధిష్ఠానంతో తుది విడత చర్చల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని బుధవారం రాత్రి కలిశారు. తెలంగాణపై పార్టీ రూపొందిస్తున్న పరిష్కార మార్గాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.తెలంగాణపై ఇంకా స్పష్టత రాలేదని, గురువారం మధ్యాహ్నం మరో మారు సమావేశమవుదామని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు సూచించారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
అయితే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ మాత్రం గురువారం ఢిల్లీలో ఉండటం లేదు. కాశ్మీర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సొంత రాష్ట్రం వెళ్లనున్నారు.అయన తిరిగి శుక్రవారం ఢిల్లీ వస్తారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ ఆజాద్‌తో సమావేశమై తెలంగాణపై చర్చిస్తారు.