ఐశ్వర్య డెలివరీపై ప్రీ కవరేజ్ ఉండరాదు

న్యూఢిల్లీ: ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రసవానికి సంబంధించిన వార్తల ప్రసారంపై స్వయంగా మీడియా ఆంక్షల్ని విధించుకోవడం తన హృదయాన్ని టచ్ చేసిందని అమితాబ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఐశ్వర్యకు డెలివరీకి సంబంధించిన వార్తల కవరేజిపై అనుసరించాల్సిన నియమాల్ని, మార్గ దర్శకాల్ని తెలియచేస్తూ.. పది పాయింట్లతో కూడిన ఓ జాబితాను బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ జారీ చేసింది. ఐశ్వర్య డెలివరీ గురించి అధికారికంగా సమాచారం అందిన తర్వాతనే వార్తల్ని ప్రసారం చేయాలని..ఐశ్వర్య డెలివరీపై ప్రీ కవరేజ్ ఉండరాదని.. బ్రేకింగ్ న్యూస్ హంగామా ఉండరాదని.. ఆస్పత్రి వెలుపల, పరిసరాల్లో బ్రాడ్‌కాస్టింగ్ వ్యాన్లను ఉంచరాదని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ సూచించింది. ఆహ్వనం మేరకే ఫోటోలు తీయడానికి వెళ్లాని స్పష్టం చేసింది. నవంబర్ మాసంలో ఓ బిడ్డకు ఐశ్వర్య తల్లి కానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu