రేపు తెలంగాణ బంద్

హైదరాబాద్: ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసరనగా  మంగళవారం తెలంగాణ బంద్కు టిఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. తెలంగాణ సాధన కోసం రెండు రోజుల క్రితం ఓ విద్యార్థి, సోమవారం ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నిర్ణయం తీసుకుంది. తెరాస తెలంగాణ బంద్ పిలుపుకు భారతీయ జనతా పార్టీ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ నగారా సమితి, తెలంగాణ టిడిపి మద్దతు పలికింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద తెరాస, బిజెపి ఎమ్మెల్యేలు మాట్లాడారు. సభలో ఆత్మత్యాగాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యల కారణంగా మరో తెలంగాణ బిడ్డ ఆత్మత్యాగం చేశారని ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ నుంచి పరీక్షలను, బస్సులను మినహాయించారు. మంత్రి డికె అరుణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సీమాంధ్ర ఎంగిలి మెతుకుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అమరులకు సభలో నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu