తాజా వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ !
posted on Jan 30, 2012 1:57PM
హై
దరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తాజా వ్యూహంపై ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. దీనికి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎంపీలు జి.వివేక్, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలం పొడగింపు, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు, రాష్ట్ర సాధన కోసం పార్టీ అధినాయకత్వంపై చేయాల్సిన ఒత్తిడి తదితర అంశాలపై కీలకంగా చర్చించారు.