విచారణకు అభ్యంతరం లేదు రీజెన్సీ ఘటనపై వీహెచ్
posted on Jan 30, 2012 1:58PM
రాజ
మండ్రి: యానాంలోని రీజెన్సీ ఘటనపై సిబిఐ విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు రాజమండ్రిలో సోమవారం స్పష్టం చేశారు. రీజెన్సీ సంఘటనకు అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనపై హర్ష కుమార్ కూడా సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్మికులు నష్ట పోకుండా ఉండేందుకు మిల్లును వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రీజెన్సీ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ హర్ష కుమార్ చెప్పారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. వారికి న్యాయం చేసే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలోని అనుమతిలేని విగ్రహాల కారణంగానే విధ్వంసాలు జరుగుతున్నాయని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం బాధాకరమని వీహెచ్ అన్నారు.