ఎమ్మార్ కేసు లో బిపి ఆచార్య అరెస్ట్

హైదరాబాద్:  ఎమ్మార్ కేసులో నిందితుడుగా పేర్కొన్న  సీనియర్ ఐఎఎస్ అధికారి, హొం శాఖ ముఖ్య కార్యదర్శి అయిన బిపి ఆచార్యని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆచార్య 2005 మే నుంచి 2007 జూన్ వరకు ఎపిఐఐసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య ఎ-1 నిందితుడిగా ఉన్నారు. ఎమ్మార్ కుంభకోణంలో బీపీ ఆచార్య పాత్ర ఉన్నదంటూ గత ఏడాది ఆగస్టు 17న ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎమ్మార్ విల్లాల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఆచార్య పట్టించుకోలేదనీ, చూసీచూడనట్లు వ్యవహరించారని సీబీఐ అభియోగం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu