నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ ఈ రోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  అధ్యక్షతన సాయంత్రం  శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనున్న కేబినెట్  సమావేశంలో  హైడ్రాకు   చట్టబద్దత కల్పించే ఆర్డినెన్స్ కు,  ధరణి కమిటీ చేసిన 54 సిఫారసులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే బీసీ కుల గణన, పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేరు పెట్టడంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇంకా వరద సహాయక చర్యలు, రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా తదితర అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu