వైసీపీలో ‘బై బై మేనియా’

వైసీపీకి వరుస  షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా బై బై చెపుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడడానికి క్యూ కడుతున్నారు. తాజాగా  మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను జగన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాల పర్వం ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నారు.   భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడో రేపో పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు  కూడా ఆ దారిలోనే ఉన్నారంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu