మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య
posted on Jun 17, 2025 9:58AM
.webp)
ఎయిర్ ఇండియా విమానాలలో తరచుగా కేతిక లోపాలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం (జూన్ 17) తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.
బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం శాన్ ఫ్రాన్సిస్కోనుంచి బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.45 కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం తెల్లవారు జామున రెండు గంటలకు ముంబైకి బయలుదేరాల్సి ఉంది. అయితే.. విమానం ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో విమానం టేకాఫ్ లో విపరీతమైన జాప్యం జరిగింది. లోపం సవరిం చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయా ణీకులందరినీ విమానం నుంచి దించివేశారు.