కివీస్ టెస్టులో రహానే సాహసం.. బౌలర్లపైనే టీమిండియా ఆశలు.. 

కాన్పూర్ టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింకా రహానే సాహసం చేశారు. తాత్కాలిక కెప్టెన్ గానే ఉన్నా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూజీలాండ్ కు కేవలం 284 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చి.. భారత సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇంకా ఒక రోజు ఆట మొత్తం ఉన్న సమయంలో 284 పరుగుల టార్గెట్ ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం పెద్ద సాహసమే. అయినా విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా భారత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి అందరికి  ఆశ్చర్యపరిచాడు అజింకా రహానే. 

తమ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్తబంతిని అప్పగించాడు. రహానే ఆశలను నిజం చేస్తూ రెండో ఓవర్ లోనే వికెట్ తీశాడు అశ్విన్.  నాలుగరోజు ఆట ముగిసే సమయానికి న్యూజీలాండ్ జట్టు వికెట్ నష్టపోయి నాలుగు పరుగులు చేసింది. అంటే చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉండగా.. కివీస్ విజయానికి 280 పరుగులు కావాలి. భారత్ కు మాత్రం గెలుపు కోసం తొమ్మిది వికెట్లు కావాలి. భారత్ లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఆ ధీమాతోనే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. 

కాన్పూర్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. మయాంక్ 17 ,  పుజారా  22 పరుగులతో ఇన్నింగ్స్ బాగానే ఆరంభించినా జేమీసన్  వీరిని విడదీశాడు. ఓ షార్ట్ పిచ్ బంతితో పుజారాను బుట్టలో వేసుకోవడంతో న్యూజిలాండ్ వికెట్ల వేట ప్రారంభించింది. అనంతరం కెప్టెన్ రహానె (4)ను అజాజ్  పటేల్ ఔట్ చేయగా.. టిమ్ సౌథీ ఒకే ఓవర్ లో మయాంక,  రవీంద్ర జడేజాను పెవిలియన్‌ పంపాడు. దీంతో భారత్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన శ్రేయస్‌, అశ్విన్ ఆరో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. అశ్విన్ అవుటయ్యాకా అక్షర్ పటేల్ తో కలిసి ఏడో వికెట్ కు 50 పరుగులు భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్.. తర్వాత అవుటయ్యారు. కాసేపు ఆజిన తర్వాత 234 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు రహానే.