చంద్రబాబుతో మహేంద్రసింగ్ ధోనీ భేటీ.. ఎందుకో తెలుసా?

భారత క్రికెట్ దిగ్గజం, టీమ్ ఇండియా మాజీ  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ   జనవరి 9న  శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సందర్శించనున్నారు. అంతే కాదు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అవుతారు. ఇప్పుడు ఈ విషయమే రాజకీయ, క్రీడా వార్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపింది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడలకు ప్రోత్సాహం  ఇవ్వడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రీడా నగర నిర్మాణం కూడా ఒక భాగం చేసిన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు ధోనీ చంద్రబాబు భేటీకి అత్యంత ప్రాధాన్యత కలగడానికి కారణమైంది. రానున్న సంవత్సరాలలో  క్రికెట్ అభివృద్ధికీ, యంగ్ క్రికెటర్లలో హిడెన్ టాలెంట్ ను వెలికి తీయడానికి అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో  అమరావతి వేదికగా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకే మహేంద్రసింగ్ ధోనీ చంద్రబాబుతో భేటీ కానున్నారని విశ్వసనీయవర్గాల భోగట్టా.   
ఇక ఇప్పటికే అమరావతిలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే యోచనలో ఉన్న చంద్రబాబు ఇప్పటికే ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా బాబూ, ధోనీ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  ఈ చర్చల సారాంశాన్ని, ఔట్ కమ్ ను బట్టి మిస్టర్ కూల్ ధోనీని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ లలో ఒకరిగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు.

దేశంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకమైనది. ధోనీ సారథ్యంలోనే టీమ్ ఇండియా.. 2007లో టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అలాగే 2011లో వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకుంది.  ఇటు ఏపీలోనూ ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అన్నిటికీ మించి దేశంలో ఒక మతంగా మారిన క్రికెట్ పట్ల ధోనీకి ఉన్న ప్రేమ  ఆయన అంతర్జాతీయ క్రికట్ కు గుడ్ బై చెప్పి ఏళ్లు గడుస్తున్న ఆయన పట్ల అభిమానుల్లో క్రేజ్ ఇసుమంతైనా తగ్గకుండా సజీవంగా ఉంచుతోంది. ఇప్పుడు ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ, అలాగే ధోనీ పర్యవేక్షణలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణం ప్రతిపాదనల నేపథ్యంలో  చంద్రబాబుతో ధోనీ  భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu