మాట మీద నిలబడటమంటే ఇదీ!.. అనిల్ కుమార్, కొడాలి నానీ సిగ్గుపడండి!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ అరాచకపాలనకు చరమగీతం పాడారు. ఐదేళ్ల పాటు వేధింపులు, దాడులు, దౌర్జన్యాలూ, కక్షసాధింపు వినా ప్రభుత్వానికి మరో పనే లేదన్నట్లుగా జగన్ సాగించిన అధ్వాన, అరాచక పాలనకు ఓటు ద్వారా అంతం పిలికారు ఏపీ జనం.  ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్ధానాలకు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకండా మిగిలిపోయింది. అయితే ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తామంటూ విర్రవీగి, సవాళ్ల మీద సవాళ్లు చేసిన వైసీపీ తోపులు ఇప్పుడు జనాలకు ముఖం చూపించలేక  అజ్ణాతంలోకి జారుకున్నారు.

 అలాంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు.   అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడా సవాళ్లను గుర్తు చేస్తే.. తాను సవాలైతే చేశాను కానీ తన సవాలును ఎవరూ స్వీకరించలేదుగా అంటే తప్పించుకుంటున్నారు. 
అలాగే బూతుల నాని అదేనండి కొడాలి నాని కూడా చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే తానాయన పాదాల  దగ్గర కూర్చుంటానని సవాల్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే కొడాలి నాని మాత్రం తన సవాలును మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబద్ధత, మాటకు కట్టుబడే తనం వైసీపీ నేతల్లో కాగడా పెట్టి వెతికినా కనిపించవు. అసలా పార్టీ అధినేతే అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మాట తప్పడం, మడమ తిప్పటమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఆయన పార్టీ నేతలు మాట మీద నిలబడతారని ఎలా అనుకుంటాం. అయితే అందుకు భిన్నంగా 2019 ఎన్నికలకు ముందు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందని సవాల్ చేసి, అలా జరగకపోతే మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యేవరకూ గ్రామంలోకి అడుగుపెట్టను అని సవాల్ చేసిన ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్త అన్న మాట మీద నిలబడి గత ఐదేళ్లూ సొంతూరులో అడుగుపెట్టలేదు.

మళ్లీ 2024 ఎన్నికలలో విజయం సాధించిన తరువాతే సొంత గ్రామంలో అడుగు పెట్టారు.  ఈ సంఘటన కుసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో జరిగింది. కేశవాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏపీ సీఎం అవుతారని కుటుంబ సభ్యులతో సవాల్ చేశారు. అలా జగరకపోతే  మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యే వరకూ గ్రామంలో అడుగుపెట్టనని ప్రతిజ్ణ చేశారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలవ్వడంతో ఆమె అన్న మాట ప్రకారం అప్పటి నుంచీ మళ్లీ కేశవాపురంలో అడుగుపెట్టలేదు. 2024 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించిన తరువాత ఆమె తన శపథం నెరవేర్చుకున్నారు. ఐదేళ్ల తరువాత స్వగ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని  ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు కేశవాపురం గ్రామస్తులు విజయలక్ష్మికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈమెను చూసి  మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి   వైసీపీ నాయకులు మాట విలువ ఏమిటో తెలుసుకుంటే మంచిది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu