ఆ టీడీపీ ముఖ్య నేతకు కరోనా... త్వరలో కరోనాను జయించి వస్తా అంటూ ట్వీట్

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి ముఖ్య నేతల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కూడా వైరస్ సోకుతోంది. తాజాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న కరోనా బారిన పడ్డారు. అనుమానంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని కూడా ఆయన తెలిపారు. 

 

"నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్లు సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను' అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేసారు.

 

ఎపుడు ఉప్పు నిప్పులాగా ట్విటర్ వేదికగా ఫైట్ చేసుకునే వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి కొద్దీ రోజుల క్రితం కరోనా సోకి హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ తో కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో విజయసాయి త్వరగా కోలుకోవాలని బుద్ధా వెంకన్న ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా అయన ట్విట్టర్ ప్రత్యర్థి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా కరోనా బారిన పడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu