తెలుగుదేశంలోకి అలాంటి వారికి నో ఎంట్రీ!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీటీపీ గూటికి చేరారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రిరాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవ్తరిలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  వీరి చేరికకు ముందు చంద్రబాబు వారితో విడివిడిగా మాట్లాడారు.

ఒక్కొక్కరితో పదే నిముషాల సేపు మాట్లాడిన ఆయన వారు తెలుగుదేశం గూటికి చేరడానికి కారణం, వారు పార్టీలో ఏ స్థానం కోరుకుంటున్నారు. ప్రజలలో వారికి ఉన్న ఆదరణ ఏంత అన్న విషయాలపై చంద్రబాబు వారితో మాట్లాడినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే.. గ‌తానికి బిన్నంగా తాజాగా పార్టీలో చేరేందుకు ముందుకు వ‌చ్చిన వారితో ఆయ‌న 10 నిమిషాల చొప్పున చ‌ర్చించారు. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరుపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారి వారి నియోజకవర్గాలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఆరా తీశారు.

 ఆ తరువాతే వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏమీ పుష్పకవిమానం  కాదన్నారు. ప్రజల కోసం పని చేసే వారికి మాత్రమే పార్టీలోకి ఎంట్రీ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఎవరినిబడితే వారిని పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజాకంటకులుగా వ్యవహరించిన  ఆ పార్టీ నేతలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu