విజయవాడ తెదేపా నగర అధ్యక్షునిగా బుద్దా వెంకన్న ఎన్నిక
posted on May 17, 2015 7:49PM
.jpg)
తెలుగుదేశం పార్టీ జిల్లాలవారిగా అధ్యక్షపదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారంనాడు జరిగిన ఎన్నికలలో కృష్ణా జిల్లాకు బచ్చు అర్జునుడు, విజయనగరం జిల్లాకు ద్వారంపూడి జగదీష్ జిల్లా అద్యక్షులుగా ఎన్నికయ్యారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో అనివార్య కారణాల వలన ఎన్నికలు వాయిదా పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష అభ్యర్ధులపై స్థానిక తెదేపా నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో అధ్యక్షుని ఎంపిక చేసే బాధ్యత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే వదిలిపెట్టాలని అందరూ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి ఎక్కువ మంది పోటీలో ఉండటంతో అందరి మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం గానీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకొన్నారో ప్రకటిస్తామని మంత్రి యనమల రామకృస్ణుడు తెలిపారు. విజయవాడ నగర తెదేపా అధ్యక్షునిగా బుద్దా వెంకన్న ఎన్నుకోబడ్డారు.