తెదేపా తుది జాబితా విడుదల

 

పొత్తుల కారణంగా సీట్లు కోల్పోయిన వారు, టికెట్స్ ఆశించి భంగపడినవారు, పార్టీలోకి కొత్తగా వచ్చినవారు తమకు దక్కాల్సిన టికెట్స్ తన్నుకుపోవడంతో ఆగ్రహంగా ఉన్నవారితో అన్ని పార్టీలు అట్టుడికిపోతున్నాయి. తెదేపా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. అయినా ఈరోజే తెలంగాణాలో నామినేషన్లు వేసేందుకు ఆఖరి రోజు కావడంతో తెదేపాతో సహా అన్ని పార్టీలు తమ తుది జాబితాలను ప్రకటించి, అభ్యర్ధులకు బీ-ఫార్మ్స్ అందజేస్తున్నాయి.

మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు పోటీ చేయాలనుకొన్న రేవంత్ రెడ్డికి నిరాశ తప్పలేదు. ఆ సీటుని పార్టీలోకి, రాజకీయాలలోకి కొత్తగా అడుగిడుతున్న మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి ఇచ్చి, రేవంత్ రెడ్డిని మళ్ళీ ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న కొండగల్ అసెంబ్లీ నియోజకవర్గానికే పంపివేశారు.

ఈరోజు విడుదలయిన తెదేపా తుది జాబితాలో టికెట్స్ దక్కించుకొన్నప్రముఖులు:

లోక్ సభ:

నామ నాగేశ్వరరావు-ఖమ్మం

మల్లా రెడ్డి-మల్కాజ్ గిరి

చిన్నపరెడ్డి-నల్గొండ

టీ.వీరేంద్ర గౌడ్-చేవెల్ల

బక్క నరసింహులు- నగర్ కర్నూల్

డా.జే.శరత్ బాబు-పెద్దపల్లి.

అసెంబ్లీ:

ఆర్.కృష్ణయ్య-ఎల్బీ నగర్

రేవంత్ రెడ్డి-కొండగల్

మోత్కుపల్లి నరసింహులు-మధిర

సీతా దయాకర్ రెడ్డి-దేవరకద్ర

రావుల చంద్రశేఖర్ రెడ్డి-వనపర్తి

కొత్తకోట దయాకర్ రెడ్డి-మక్తల్

ఎర్రబెల్లి దయాకర్ రావు-పాలకుర్తి

తుమ్మల నాగేశ్వర రావు-ఖమ్మం

కూన వెంకటేష్ గౌడ్-సికింద్రాబాద్

మిర్జా యాసిన్ బేగ్-నిర్మల్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu