జయలలిత ఆస్తి పత్రాలు అపహరణ..!
posted on May 3, 2017 10:35AM
.jpg)
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ట్విస్ట్ నెలకొంది. ఇటీవలే దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్ లో అమ్మకు సంబంధించిన డాక్యుమెంట్లు చోరీకి గురవ్వడమే కాకుండా..ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ చోరీలో నగదు, నగలు, కొన్ని కీలక డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని సమాచారం. ఎస్టేట్ లోని జయ పర్సనల్ రూమ్ లో మూడు సూట్ కేసులు పగులగొట్టిన స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉండటంతో... చోరీ జరిగినట్టు అనుమానిస్తున్నారు. దుండుగులు ఎత్తుకెళ్లిన వాటిలో జయ ఆస్తుల వీలునామా కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దోపిడీలో పాల్గొన్న ఒక వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రూ. 200 కోట్ల విలువైన సొత్తుతో పాటు, జయ వీలునామా కూడా అపహరణకు గురైనట్టు తెలుస్తోంది.