ఆప్ పార్టీలో ముసలం..
posted on May 2, 2017 6:12PM
.jpg)
ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఆప్ పార్టీ ఓటములు చవిచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఓటముల వల్ల ఆప్ పార్టీలోని కొంత మంది నేతలు కూడా పార్టీనుండి జంప్ అవుతున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం మొదలైంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై పలువురు సొంత నేతలే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా కుమార్ విశ్వాస్ ఒకరు. ఈ సందర్బంగా కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి వస్తారని.. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండాలా? లేదా? అన్న విషయం గురించి 24 గంటల్లో ఓ ప్రకటన చేస్తానని ఆయన అన్నారు.